నాగార్జున నాకు గురువు...!
నాగార్జున సినిమాతో కెరియర్ ప్రారంబించిన అనుష్క, నాగ్ తో నాలుగు సినిమాలు చేసింది. వాళ్ళిద్దరి మధ్య వెండితెర పై కెమిస్ట్రీ బాగుంటుందని విమర్శకులు అంటారు. ఇవాళ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనుష్క “నాగ్ తనకు ఒక ప్రిన్సిపాల్ లాంటి వాడని, సినిమాలో తను ఎక్కడ తప్పులు చేసినా సరిచేయడమే కాకుండా మంచి సలహాలు ఇస్తుంటాడు” అని చెప్పింది. “అరుంధతి” సినిమా ఒప్పుకొనే ముందు తనకు నటించడమే తెలియదని ఆ చిత్ర నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి తనకు దగ్గర ఉండి ఎలా నటించాలో చెప్పేవారని చెప్పింది. మీడియా లో కధలు వస్తున్నట్లుగా తనకు నాగ్ కు ఎటువంటి బేధాపిప్రాయాలు లేవని తను తెలుగు తెరకు దూరం కానని కూడా ఈ యోగ బ్యూటీ చెపుతోంది. కాకతీయుల చరిత్ర “రుద్రమదేవి” సినిమా గురించి తను రెండూ నెలలుగా గుర్రపుస్వారీ,కత్తిసాము విద్యలలో శిక్షణ తిసుకుంటున్నానని చెపుతూ తనకు తెలుగు బాగా వచ్చని కేవలం సమయం లేక మాత్రమే తను డబ్బింగ్ చెప్పించు కుంటున్నానని ఈ బ్యూటీ తన భావాలు పత్రికల వాళ్ళతో పంచుకుంది.ఏదిఏమైనా తెలుగు తెర కు దూరం కాలేదు అన్న అనుష్క మాటలు ఎన్ని నిజాలో రాబోయే కాలంలో తేలుతుంది……..
0 Comments